వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ ఎంపి రాజయ్యపై కేసు, అరెస్టు చేసే అవకాశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajaiah
వరంగల్/మహబూబ్‌నగర్: వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్యపై ఆదివారం కేసు నమోదయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనపై వరంగల్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను మరికాసేపట్లో అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో స్థానికేతరులు ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఉండటం నిబంధనలకు విరుద్ధం. అయితే రాజయ్య ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి స్టేషన్ ఘనపూర్‌లోని తాటికాయలలో మకాం వేశారు. దీంతో ఆయనపై ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ధృవీకరించారు. దాంతో రాజయ్యపై కేసు నమోదు చేశారు. రాజయ్యపై సెక్షన్ 151 కింద కేసు నమోదు చేశారు.అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది.

కాగా మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కూనీ చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి పాలించే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెసు పార్టీ మోసం చేసిందన్నారు. ఆయన కొల్లాపూరులోని గరల్స్ హైస్కూలులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు.

English summary
Warangal police booked case against Congress MP Rajaiah today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X