పరిష్కరిస్తేనే: కొవూరులో ఓటింగ్ బహిష్కరించిన గ్రామం

కాగా నిజామాబాది జిల్లాలో ఉప ఎన్నికల్లో ఓ ప్రిసైడింగ్ అధికారి నిర్వాకం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈవిఎంలో ఓటు వేయడం తెలియని ఒక వృద్ధ మహిళా కాంగ్రెసు గుర్తుపై ఓటు వేసేందుకు సహకరించమని ప్రిసైండింగ్ అధికారిని కోరింది. అయితే ఆ అధికారి మాత్రం ఓటును టిఆర్ఎస్‌కు వేశారు. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. కాగా వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఓ కాంగ్రెసు నేత ఇంట్లో పోలీసులు రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. జఫర్‌గడ్‌లో టిడిపి నేత మనోజ్ రెడ్డిని బైండోవర్ కేసు కింద అరెస్టు చేశారు. నాగర్ కర్నూలులోని రాకొండలో టిడిపి, కాంగ్రెసు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలింగ్ కొద్ది సేపు నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications