వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టుల చెరలో ఇద్దరు ఇటాలియన్ పర్యాటకులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Maoists
న్యూఢిల్లీ: ఇటలీ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని ఒడిశాలోని కందమాల్ జిల్లాలో మావోయిస్టులు అపహరించినట్లుగా తెలుస్తోంది. మార్చి 14న మొత్తం నలుగురిని అపహరించగా పూరీ ప్రాంతానికి చెందిన భారతీయులిద్దరినీ శనివారం విడుదల చేశారని కందమాల్ ఎస్పీ జైనారాయణ్ పేర్కొన్నారు. అపహరణకు గురైన వారిలో ఒక వ్యక్తి 19 ఏళ్లుగా పూరీలో నివసిస్తున్నాడని, అక్కడ అతను అడ్వెంచర్ టూరిజానికి సంబంధించిన ఏజెన్సీ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. తాము ఇద్దరు ఇటాలియన్లను అపహరించినట్లు మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పాండా ఒక ఆడియో టేపు పంపించారు.

ప్రభుత్వం తీవ్రవాద వ్యతిరేక చర్యలకు పాల్పడడం మాని, వారితో చర్చలకు సిద్ధపడేవరకూ వారిని విడిచి పెట్టమని ఆ టేపులో పేర్కొన్నారు. ఆ విదేశీయులు ఆదివాసీ ప్రజలను అభ్యంతరకర రీతిలో ఫొటోలు తీస్తున్నారని వారు ఆరోపించారు. కాగా ఒడిశా ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

English summary
Maoist rebels have kidnapped two Italian tourists in the eastern Indian state of Orissa and issued a set of demands for their release, police told AFP on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X