వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
త్రివేది రాజీనామా: రైల్వే మంత్రిగా ముకుల్ రాయ్

మమతా బెనర్జీతో మాట్లాడిన తర్వాత దినేష్ త్రివేది తన రాజీనామా లేఖను ప్రధానికి పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. త్రివేదితో మాట్లాడానని, త్రివేదీ ఈ రాత్రికి రాజీనామా చేస్తారని మమతా బెనర్జీ చెప్పారు. మమతా బెనర్జీ తనతో మాట్లాడారని, రాజీనామా చేయాలని టిఎంసి కోరుకుంటోందని, తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి రాజీనామా చేస్తానని త్రివేది చెప్పారు. మమతా బెనర్జీ నుంచి రాతపూర్వకమైన లేఖ అందితే తప్ప రాజీనామా చేయబోనని చెప్పిని త్రివేది ఎట్టకేలకు దిగి వచ్చారు.