చిరంజీవి, సీమాంధ్ర: రాజ్యసభ ఎంపికపై అసంతృప్తి?

చిరంజీవి అందరివాడు కాబట్టి సీమాంధ్రకు అధిష్టానం రాజ్యసభ పదవి విషయంలో ఈసారి మొండి చేయి చూపినట్లేనని కొందరు భావిస్తున్నారని తెలుస్తోంది. ఒక్క పదవి ఇచ్చినా బాగుండేదని అంటున్నారని తెలుస్తోంది. అయితే మరికొందరు నేతలు మాత్రం ఎంపిక విధానాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారట. సీనియర్ నేతలు రాయపాటి సాంబశివ రావు, జెసి దివాకర్ రెడ్డి ఎంపికను స్వాగతించారు. కాగా ఇంతకుముందు తెలంగాణకు రెండి(కెకె, సంజీవ రెడ్డి), సీమాంధ్రకు ఒకటి(దాసరి), బయటి వారికి ఒకటి(రషీద్ అల్వీ)లకు కేటాయించారు. కానీ ఈసారి బయట వారికి ఇవ్వకుండా ఆ స్థానంలో తెలంగాణ వారికి అవకాశం కల్పించారు.












Click it and Unblock the Notifications