వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభలోనూ వీగిపోయింది, గట్టెక్కించిన ఎస్పీ, బిఎస్పీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: ఎన్‌సిటిసి అంశంపై రాజ్యసభలోనూ యుపిఏ సర్కారు గట్టెక్కింది. సోమవారం లోకసభలో బిజెపి, లెఫ్ట్ పార్టీలు ఎన్‌సిటిసిపై తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. లోకసభలో వీగి పోయింది. మంగళవారం అదే తీర్మానం రాజ్యసభలోనూ వీగిపోయింది. ఎన్‌సిటిసి అంశంపై రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు ప్రతిపాదిస్తూ బిజెపి, లెఫ్ట్ పార్టీలు తీర్మానం ప్రవేశ పెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 82, వ్యతిరేకంగా 105 మంది ఎంపీలు ఓటు వేశారు. ఓటింగ్‌కు యుపిఏ భాగస్వామ్య పార్టీ తృణమూల్ కాంగ్రెసు పార్టీ గైర్హాజరైంది. మరోవైపు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్టీలు సమాజ్ వాది, బహుజన్ సమాజ్ పార్టీలు ప్రభుత్వానికి అండగా నిలవడం విశేషం. యుపిఏకు తగిన సంఖ్యా బలం లేకపోయినప్పటికీ ఎస్పీ, బిఎస్పీ పార్టీల వల్ల గట్టెక్కింది.

కాగా సోమవారం లోకసభలో ఎన్‌సిటిసిని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. యుపిఏ ప్రభుత్వం ఎన్‌సిటిసిని వ్యతిరేకిస్తూ బిజెపి నేత సుష్మా స్వరాజ్ లోకసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 227 రాగా అనుకూలంగా 141 ఓట్లు వచ్చాయి. లెఫ్ట్ పార్టీలు పెట్టిన తీర్మానం కూడా వీగిపోయింది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెసుఈ తీర్మానానికి గైర్హాజరయ్యాయి. లోకసభలో అవిశ్వాస తీర్మాన వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.

English summary
After winning its first battle in the Lok Sabha, the UPA government secured a victory in the Rajya Sabha on Tuesday on the issue of the fiercely contested NCTC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X