మమ్మల్ని ప్రజలు కొంత నమ్మారు: తెలంగాణపై బాబు

తెలంగాణకు తాము అన్యాయం చేయలేదని, తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని చెప్పగలిగామని ఆయన అన్నారు. సెంటిమెంటును గుర్తిస్తూనే అభివృద్ధి చేశామని చెప్పామని ఆయన అన్నారు. ఈ విషయంలో తాము కొంత మేర విజయం సాధించామని ఆయన అన్నారు. తమ పార్టీని బలహీనపరచాలని, తమ పార్టీ శాసనసభ్యులను లాక్కుని ఉప ఎన్నికలు తెచ్చారని ఆయన విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఉప ఎన్నికలు తెచ్చారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిలో వెనకడుగు వేస్తోందని ఆయన అన్నారు. 2009 తర్వాత వరుసగా ఉప ఎన్నికలు వస్తున్నాయని, ఈ రకంగా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్ని ఉన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications