వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికల్లో కెసిఆర్ కారు జోరు, జగన్ ఫ్యాన్ హవా

By Pratap
|
Google Oneindia TeluguNews

TRS win and YSR Congress win bypolls
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో ఊహించినట్లుగానే కారు జోరు, ఫ్యాన్ హవా నడిచింది. తెలంగాణలోని ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం సాధించింది. ఆరో స్థానంలో తెరాస బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణవాదాన్ని బలంగా వినిపించిన బిజెపి విజయం సాధించింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఓటమి చవి చూశాయి. కామారెడ్డిలో తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. ఆయన కాంగ్రెసు అభ్యర్థిపై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ డిపాజిట్ గల్లంతయింది.

వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి టి రాజయ్య 32 వేల భారీ ఆధిక్యతతో తెలుగుదేశం అభ్యర్థి కడియం శ్రీహరిపై విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెసు అభ్యర్థి డిపాజిట్ కోల్పోయింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి జోగు రామన్న విజయం సాధించారు. తెలంగాణవాదం బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా తెరాస విజయం సాధించింది. కొల్లాపూర్‌లో తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెసు, తెలుగుదేశం రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. మంత్రి డికె అరుణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడినప్పటికీ జూపల్లి కృష్ణారావు విజయాన్ని అడ్డుకోలేకపోయారు. నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు.

మహబూబ్‌నగర్‌లో తొలుత కాంగ్రెసు అభ్యర్థి ముత్యాల ప్రకాష్ ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో పుంజుకుని తెరాస అభ్యర్థి ఇబ్రహీం నాలుగో స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి ఎగబాకారు. అయితే ఆఖరు రౌండ్‌లో బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డి పుంజుకుని విజయం సాధించారు. కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.

English summary
Telangana Rastra Samithi won out of six seats in Telangana and Nagam Janardhan Reddy, supported by TRS won Nagar Kurnool seat. YSR Congress candidate Nallapureddy Prasanna Kumar Reddy won Kovur seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X