వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్‌దే భవిష్యత్తు: కోవూరుపై శ్రీకాంత్ రెడ్డి

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పెద్ద యెత్తున కోవూరులో డబ్బులు కుమ్మరించాయని, ప్రజలను కొనుక్కోవడం సాధ్యం కాదని కోవూరు ప్రజలు నిరూపించారని ఆయన అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని, ఈ రెండు పార్టీలు కుమ్మక్కయి శాసనసభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చూస్తున్నాయని, ఆ పార్టీలకు ప్రజలు పట్టడం లేదని ఆయన అన్నారు. తాము నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. ఆ రెండు పార్టీల దుష్టసంప్రదాయానికి స్వస్తి చెప్పేలా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. కోవూరులో తమ పార్టీ కార్యకర్తలను కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించిన కోవూరు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.