ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి జోగు రామన్న విజయం సాధించారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థిపై 31 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెసు మూడో స్థానంలో నిలిచింది. గతంలో ఈ సీటు తెలుగుదేశం పార్టీది.
తెలుగుదేశం పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన జోగు రామన్న ఆ పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాసలో చేరారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన జోగు రామన్న విజయం సాధించారు.