నాలుగు స్థానాల్లో కారు, పాలమూరులో షాక్

ఆశ్చర్యకరంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో తెరాస రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడు బిజెపి తెరాసకు షాక్ ఇచ్చింది. బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డి తెరాస అభ్యర్థి ఇబ్రహీంపై సంచలన విజయం సాధించారు. కాంగ్రెసు మూడో స్థానంలో, తెలుగుదేశం నాలుగో స్థానంలో ఉన్నాయి. బిజెపి చివరి నిమిషంలో పుంజుకుని తెరాసపై విజయం సాధించింది. తొలుత మొదటి స్థానంలో నిలిచిన కాంగ్రెసు అభ్యర్థి ముత్యాల ప్రకాష్ మూడో స్థానానికి దిగజారారు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి జోగు రామన్న విజయం సాధించారు. కామారెడ్డి నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్ ఘన విజయం సాధించారు. తెలుగదేశం పార్టీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతైంది. కొల్లాపూర్‌లో తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. అయితే, ఆయనపై కాంగ్రెసు అభ్యర్థి హోరాహారీ పోరాటం చేశారు. నాగర్ కర్నూలులో స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు.