నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. పది రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కంటే 23 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 45,836 ఓట్లు రాగా, కాంగ్రెసుకు 38,429 ఓట్లు వచ్చాయి. ఇంకా పన్నెండు వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇప్పటికే 23వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్న నల్లపురెడ్డి గెలుపు ఖాయం. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.