వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దిగి వచ్చిన అధిష్టానం: యెడ్డ్యూరప్పకు తిరిగి సిఎం పీఠం

యడ్యూరప్పకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన బుధవారం సాయంత్రం ఢిల్లీకి వస్తారని అంటున్నారు. ఆయన ఢిల్లీ కేంద్ర నాయకత్వంతో సమావేశమవుతారు. తన వర్గం శానససభ్యులతో ఆయన రిసార్టులో శిబిరం నిర్వహిస్తున్నారు. వారు శానససభ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు.
అక్రమ మైనింగ్ వ్యవహారంలో లోకాయుక్త తప్పు పట్టడంతో ఆయన నిరుడు జులైలో ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఈ ఆరోపణలను హైకోర్టు తోసిపుచ్చడంతో ఆయన తిరిగి ముఖ్యమంత్రి పదవి కావాలంటూ బిజెపి అధిష్టానానికి గడువులు పెడుతున్నారు. ప్రస్తుతం యడ్యూరప్ప శిబిరంలో 70 మంది శాసనసభ్యులున్నారు.