వైయస్‌ను మెచ్చి, కిరణ్ రెడ్డిని తప్పు పట్టిన కెకె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెత్తు వైఖరితో వ్యవహరిస్తూ ఇదే తీరులో పోతే వైయస్ జగన్‌కు మెజారిటీ సీట్లు వెళ్తాయని ఆయన అన్నారు. జెడ్పిటీసిలు ఓడిపోతేనే వైయస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు మంత్రులను రాజీనామా చేయించారని ఆయన అన్నారు. కోవూరు ఎన్నికను ముఖ్యమంత్రి తక్కువ అంచనా వేశారని ఆయన అన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రికి కూడా కిరణ్ కుమార్ రెడ్డి విలువ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ సెంటిమెంటు ముందు అభివృద్ధి నినాదం పని చేయదని చెప్పినా ముఖ్యమంత్రి వినలేదని ఆయన అన్నారు. తెలంగాణకు అతి పెద్ద విలన్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యేనని ఆయన తప్పు పట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే కాంగ్రెసు బతుతుకుందని ఆయన అన్నారు. సెంటిమెంటు కన్నా అధికారమే పనిచేస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నారని, దాంతోనే అభివృద్ధి నినాదాన్ని ముందుకు తెచ్చారని ఆయన అన్నారు. అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. పార్టీని పక్కన పెట్టి అంతా ప్రభుత్వమే చేస్తుందనే పద్ధతిలో ముఖ్యమంత్రి వ్యవహరించారని ఆయన అన్నారు. అభివృద్ధి చేయడం, ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ అబ్బసొత్తు కాదని, అది ప్రజల హక్కు అని ఆయన అన్నారు. అభివృద్ధి నినాదం సెంటిమెంటు ముందు పనిచేయదని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రానికి తప్పుడు నివేదికలు, సమాచారాన్ని అందించారని ఆయన అన్నారు. కావాలనే ముఖ్యమంత్రి అలా చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications