హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఉప ఎన్నికల్లో వైయస్ గెలిపించారు, కిరణ్ పోగొట్టారు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy - Kiran Kumar Reddy
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమి ఆ పార్టీలో చిచ్చు రగుల్చుతున్న విషయం తెలిసిందే. కొందరు నేతలు 2008లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అన్నీ తానై గెలిపించారని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం వైఫల్యం చెందారని అంటున్నారు. అందుకు పలు కారణాలు వారు చెబుతున్నారు. ఉప ఎన్నికలపై కిరణ్‌కు వ్యూహం లేకపోవడం ప్రధాన కారణమని అంటున్నారు. పార్టీలో సమన్వయం లేక పోవడం మరో ప్రధాన కారణమని చెబుతున్నారు. పార్లమెంటు సభ్యులు ఎవరూ ఉప ఎన్నికల ప్రచారానికి రాకపోవడమే ఇందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు. అలాగే గ్రౌండ్ రియాలిటీస్ పట్ల ఆయన దృష్టి సారించలేదని అంటున్నారు. పార్టీని సరిగా ప్రొజెక్ట్ చేయలేదని అంటున్నారు. పల్స్ పోల్స్ పట్టాలంటే కిందిస్థాయి నేతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని, కానీ కిరణ్ అలా చేయలేదని విమర్శిస్తున్నారు. అనుభవజ్ఢుల మాటలు పెడ చెవిన పెట్టారని అంటున్నారు. ముఖ్యమంత్రి అన్నీ తాను చేసేదే నిజమని నమ్ముతారని, అదే ఆలోచనతో ఉప ఎన్నికలకు వెళ్లి చతికిల పడ్డారని అంటున్నారు. ఆయన వ్యూహం బెడిసి కొట్టిందంటున్నారు.

2008లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అన్నీ తానై గెలిపించారని అన్నారు. ఎన్నికలకు వెళ్లే ముందే వైయస్ ఫలితాలు ఎలా వచ్చినా తాను బాధ్యత వహిస్తానని చెప్పారని, కానీ కిరణ్ మాత్రం అలా చేయడం లేదని అంటున్నారు. ఖాళీ అయినవి పార్టీ సీట్లు కాకపోయినప్పటికీ వైయస్ ఒకటికి రెండు సార్లు ఆయా నియోజకవర్గాలలో పర్యటించి ఐదు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాలు గెలిపించారని కిరణ్ మాత్రం ఉన్న సీట్లలో కూడా గెలిపించలేక పోయారంటున్నారు. విపక్షాల స్థానాలు అయినప్పటికీ వైయస్ అన్ని నియోజకవర్గాలను పూర్తిగా పరిశీలించారని, స్థానిక నేతలతో మాట్లాడి అన్నింటిని అంచనా వేశారని అంటున్నారు.

అందుకు విరుద్ధంగా కిరణ్ కాంగ్రెసు పార్టీ స్థానాలు అయిన కొల్లాపూర్, స్టేషన్ ఘనపూర్‌లో అంచనా వేయలేక పోయారని, అంతేకాకుండా టిడిపి స్థానాలతో ఖాళీ అయి, విపక్షాలు ఓట్లు చీలినప్పటికీ కిరణ్ దానిని సద్వినియోగం చేసుకోలేక పోయారని అంటున్నారు. కనీసం ఆయా స్థానాలలో కాంగ్రెసును రెండో స్థానంలో కూడా నిలబెట్టలేక పోయారని విమర్శిస్తున్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెసు ఆ రెండో స్థానంలోనైనా నిలవడానికి కారణం మంత్రి డికె అరుణ గెలుపు కోసం చేసిన ప్రయత్నమే తప్ప కిరణ్ చేసిందేమీ లేదంటున్నారు. అన్ని నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి అలా మెరిసి ఇలా మాయమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అభ్యర్థుల విషయంలోనూ సిఎం నిర్ణయాలు గందరగోళానికి దారి తీశాయంటున్నారు. మ.గనర్‌లో విష్ణువర్ధన్ రెడ్డికి బదులు రాజేశ్వర రెడ్డి సతీమణిని నిలబడితే కాంగ్రెసు గెలిచి ఉండేదని అంటున్నారు. కొవూరులో నల్లపురెడ్డిపై బలమైన అభ్యర్థిని నిలబెట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కిరణ్ క్యాడర్ కన్నా యంత్రాంగం మీదే ఆధారపడ్డారని అంటున్నారు. కిరణ్ దాదాపు అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దివంగత వైయస్ కాలికి బలపం కట్టుకొని తిరిగి 2008లో గెలిపించారని, కిరణ్ మాత్రం అతివిశ్వాసంతో వెళ్లి ఉన్నవాటిని కూడా నిలబెట్టలేక పోయారని అంటున్నారు.

English summary
Congress Party leaders accused CM Kiran Kumar Reddy for defeat in bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X