సిఎంపై కుంభకోణం బాంబు పేల్చిన శంకరరావు

ఎర్రచందనం కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఇందులో మూడు కంపెనీలకు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఎమ్మార్ కేసు, జగన్ ఆస్తుల కేసులపై విచారణ జరుగుతోందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎర్రచందనం అమ్మకానికి గ్లోబల్ టెండర్లు పిలవాలనే నిబంధనను ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని ఆయన విమర్శించారు. ఎర్రచందనాన్ని ప్రభుత్వం లోపాయికారిగా అమ్మేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలని ఆయన హైకోర్టును కోరారు.












Click it and Unblock the Notifications