హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై సోనియా గాంధీ ఆలోచన చేస్తున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్: ఏడు శాసనసభా స్థానాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై ఆలోచన చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లో నాలుగు స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులు, ఒక స్థానంలో బిజెపి అభ్యర్థి, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాలను తెలంగాణ ఆకాంక్ష ఫలితమేనని జాతీయ మీడియా కూడా అంచనా వేస్తోంది. బిజెపి మతవాదంపై ఆధారపడి గెలిచిందనే పాలక కాంగ్రెసు పార్టీ వాదనను కొట్టిపారేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం సుముఖంగా లేదని ప్రజలు అర్థం చేసుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలిస్తే తెలంగాణ ఇస్తుందనే నమ్మకంతోనే మహబూబ్‌నగర్‌లో బిజెపి అభ్యర్థిని గెలిపించారనే వాదన గట్టిగానే వినిపిస్తోంది.

ఆ వాదనకు బలం చేకూర్చే విధంగానే కాంగ్రెసు తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెసు మట్టి కొట్టుకుపోవడం ఖాయమనే వారంటున్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానంపై కాంగ్రెసు నాయకులు ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయి. తెలంగాణను తేల్చకపోతే ఫలితాలు ఘోరంగా ఉంటాయని సోనియా గ్రహింపునకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో తెలంగాణను తేల్చేయడమే మంచిదనే భావనతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు.

సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు మధ్య పోటీ ఉంటుందని, తెలంగాణలో తెరాస సీట్లను కొట్టుకుపోతుందని, పైగా బిజెపి బలపడే అవకాశాలున్నాయని ప్రస్తుత ఎన్నికల ఫలితాలను బట్టి విశ్లేషిస్తున్నారు. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఈ ప్రాంతంలోనైనా పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సోనియా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీమాంధ్రలో గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు వదిలేసి, తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. వీలైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చి, తెరాస విలీనానికి ప్రయత్నాలు చేయాలని సోనియా అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, తెలంగాణపై సోనియా గాంధీ సీరియస్‌గా ఆలోచించాల్సిన స్థితిని ఈ ఫలితాలు కల్పించాయని అంటున్నారు.

English summary
Analysts perceive that in a last ditch effort the party can go ahead and create Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X