వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభలో సహకారానికి టి - కాంగ్రెసు ఎంపిలు నో

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
న్యూఢల్లీ/ హైదరాబాద్ : లోకసభ సజావుగా జరగడానికి సహకరించారని కేంద్ర మంత్రులు శరద్ పవార్, బన్సల్ చేసిన విజ్ఞప్తిని కాంగ్రెసు తెలంగాణ పాపర్లమెంటు సభ్యులు నిరాకరించారు. సభ సజావుగా జరగడానికి సహకరించాలని కేంద్ర మంత్రులు శరద్ పవార్, బన్సల్ కోరారని, తెలంగాణపై చర్చ జరిగే వరకు తాము సభను అడ్డుకుంటామని చెప్పామని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూనుకోవాలని వారు డిమాండ్ చేశారు. రేపు తెరాస తలపెట్టిన బంద్‌కు వారు మద్దతు ప్రకటించారు. పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, జి. వినోద్, మందా జగన్నాథం తదితరులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

కాగా, తెలంగాణపై త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణకు చెందిన మంత్రి సారయ్య హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభా సమావేశాలు ముగియగానే తెలంగాణపై అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు. రెండు, మూడు రోజుల్లో తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు సమావేశమై తెలంగాణపై కార్యాచరణ రూపొందించుకునే అవకాశాలున్నాయి.

తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని తాము కూడా కోరుకుంటున్నట్లు రాయలసీమకు చెందిన మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరడానికి తాము ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు.

English summary
Telangana Congress MPs rejected to cooperate in Loksabha till the debate is allowed on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X