హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గేటు ముందు అడ్డంగా పడుకున్న తెరాస ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: తెలంగాణ కోసం వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన బోజ్యా నాయక్ ఆత్మహత్య నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాసనసభ్యులు సోమవారం అసెంబ్లీ ద్వారానికి అడ్డుగా పడుకున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను లోనికి వెళ్లనిచ్చేది లేదని హెచ్చరించారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గేటు ముందు అడ్డంగా సభ్యులు లోనికి వెళ్లకుండా పడుకున్నారు. మిగిలిన వారందరూ అక్కడే బైఠాయించారు. తెలంగాణపై మాట తప్పిన పార్టీలకు అసెంబ్లీలో ప్రవేశం లేదని, తెలంగాణ ద్రోహులను లోనికి వెళ్లనివ్వమని, సమైక్యవాదులకు, వెన్నుపోటు పొడిచిన వారికి ఇక్కడ స్థానం లేదని వారు నినాదాలు చేశారు. అయితే పోలీసులు కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

సభ ప్రారంభమైన కొద్ది సేపటికే స్పీకర్ వాయిదా వేశారు. తెలుగుదేశం, తెరాస పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ అంశంపై పట్టుబట్టారు. ఇరు పార్టీల సభ్యులు పోడియం వద్దకు దూసుకు పోయారు. దీంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. అంతకుముందు విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. కాగా ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా కొవూరు నుండి గెలిచిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 29న ప్రమాణం స్వీకారం చేయనున్నారు. గంప గోవర్ధన్, జోగు రామన్న, టి.రాజయ్య, జూపల్లి కృష్ణా రావు, నాగం జనార్ధన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా సభలో తెరాస బలం 16, బిజెపి బలం 3కు పెరిగింది.

కాగా అంతకుముందు గన్ పార్కు వద్ద తెరాస ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ కోసం యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. తెలంగాణ కోసం ఇంతమంది చనిపోతున్నా ఆంధ్రా నేతలు సానుభూతి తెలిపింది లేదన్నారు. తెలంగాణ పంథాను వీడేది లేదని ఈటెల రాజేందర్ అన్నారు. కాగా నాగం జనార్ధన్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లబోతుండగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నాగం మండిపడ్డారు. కిరణ్ నీకు మూడిందన్నారు. ఆయన భరతం పడతామన్నారు. ఆయనకు మనసు లేదన్నారు.

English summary

 TRS MLAs obstructed Congress and Telugudesam Party MLAs in to Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X