'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని చాలా మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఆశపడుతుంటారు. పవన్ తో ఒక్క సినిమా చేసినా చాలు తమ లైఫ్ సెటిల్ అనుకునేవాళ్లూ ఉన్నారు. ఇక పవన్ కల్యాణ్ ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గతేడాది ఓజీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇక తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఉగాది కానుకగా విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ దూసుకెళ్తోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో అంతకుముందు వేరే హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆమె ఆ సమయంలో బిజీగా ఉండటంతో వేరే సినిమాలకు కమిట్ అయిన ఈ సినిమాను మిస్ చేసుకుంది ఆ స్టార్ హీరోయిన్.

'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో ముందుగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను అనుకున్నారట. ఇప్పటికే పూజా హెగ్డేతో హరీష్ శంకర్ డీజే సినిమా చేశారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. దాంతో పవన్ కల్యాణ్ మూవీలో మొదట పూజా హెగ్డే అని ఫిక్స్ అయ్యారట. కానీ ఆ సమయంలో పూజా హెగ్డే బిజీగా ఉండటం వల్ల తను వేరే సినిమాలకు కమిటై ఈ సినిమాను మిస్ చేసుకుంది. ఇక ఈ మూవీతో శ్రీలీల మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.

Sreeleela Ustaad Bhagat Singh Role Which Big Heroine Was Originally Considered Ustaad Bhagat Singh

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో 2012లో గబ్బర్ సింగ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో మళ్లీ రిపీట్ కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీలో కొత్తదనం లేకపోయినా పవన్ కల్యాణ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+