హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తండ్రి శవంతో వైయస్ జగన్ రాజకీయం: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని కనీసం సానుభూతి కూడా ప్రదర్శించకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేపట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వైయస్ జగన్‌పై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్ అంతటి అవినీతిపరుడు ప్రపంచంలోనే లేడని ఆయన అన్నారు. కాంగ్రెసుతో జగన్ లాలూచీ పడ్డారని, తమకు కాంగ్రెసుతో లాలూచీ పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శవరాజకీయాలు చేసే జగన్‌కు నైతిక విలువలు ఏమున్నాయని ఆయన అడిగారు. కేంద్రంతో జగన్ లాలూచీ పడ్డారని ఆయన ఆరోపించారు.

జగన్ లాంటివాళ్లను చాలా మందిని చూశామని, తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేకపోయారని, జగన్ కూడా ఏమీ చేయలేడని ఆయన అన్నారు. వేల కోట్ల రూపాయలు జగన్‌కు ఎలా వచ్చాయని ఆయన అడిగారు. ఓదార్పు పేరుతో ఊరూరూ వెళ్లి జగన్ కథలు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన ఆస్తులపై వివరణ ఇచ్చానని, జగన్ కూడా తన ఆస్తులపై వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు. సిబిఐ వద్దకు జగన్ తండ్రి వెళ్లాడు, జగన్ తల్లి వెళ్లిందని, ఏమీ చేయలేకపోయారని ఆనయ అన్నారు. తప్పును కప్పి పుచ్చుకోవడానికి జగన్ ఎదుటివారిపై దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞాన్ని ధనయజ్ఝంగా మార్చలేదా అని ఆయన అడిగారు. దమ్ముంటే ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని ఆయన జగన్‌ను సవాల్ చేశారు.

శవరాజకీయాలు చేసేవారా తమపై మాట్లాడేదని, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని ఆయన జగన్‌ను ఉద్దేశించి అన్నారు. తమ కుటుంబం ఏ విధమైన తప్పూ చేయలేదని, అధికారాన్ని అడ్డం పెట్టుకోలేదని ఆయన అన్నారు. ఎన్నికలను జగన్ కోడిపందాలుగా మార్చారని ఆయన ఆరోపించారు. జగన్‌వి హీనరాజకీయాలని, అధికారం వస్తే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకుంటాడని ఆయన అన్నారు. జగన్‌కు నైతిక విలువలు లేవని ఆయన అన్నారు.

తెలంగాణపై తమ నిర్ణయం ఎప్పుడో చెప్పామని, అధికార కాంగ్రెసు పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. విలువైన జీవితాలను కోల్పోవద్దని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెసు తమపై నిందలు మోపాలని చూస్తోందని ఆయన అన్నారు.

English summary
TDP president N Chandrababu Naidu lashed out at YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X