రాజమౌళి అంతిమయాత్ర: వైయస్ విగ్రహంపై రాళ్ల దాడి

Warangal District
వరంగల్: తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ రాజమౌళి అంతిమ యాత్ర సందర్భంగా సోమవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ఎంజిఎం ఆస్పత్రి నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఎంజిఎం సెంటర్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహంపై తెలంగాణవాదులు రాళ్లు రువ్వారు. వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహంపై దాడి చేశారు. కాశీబుగ్గలో ఇందిరా గాంధీ విగ్రహాన్ని కూడా తెలంగాణవాదులు కూల్చివేశారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్య ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు.

రాజమౌళి సూసైడ్ నోట్‌ను ఎస్పీ మార్చారని, ఒరిజినల్ సూసైడ్ నోట్‌ను బయటపెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కారణమని తెరాస మరో శాసనసభ్యుడు కెటి రామారావు విమర్శించారు. హంతకులే సంతాపం ప్రకటిస్తుంటే ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. రాజమౌళి అంతిమ యాత్రలో తెరాస, బిజెపి శానససభ్యులు, తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి, తెలుగుదేశం తిరుగుబాటు శానససభ్యులు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి పాల్గొన్నారు.

కాగా, తెలంగాణద్రోహుల వల్లనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆటో డ్రైవర్ రాజమౌళి కుమారుడు శరత్ చంద్ర హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డిపై అతను ఫిర్యాదు చేశాడు. గండ్ర వెంకటరమణా రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

రాజమౌళి మృతికి సంతాపసూచకంగా ఎబివిపి ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉస్మానియా వై జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. రాజమౌళి తెలంగాణ కోసం సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+