సూసైడ్ నోట్లపై సభలో చర్చించండి: కోదండరామ్

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వ్యాఖ్యల వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. నాయకులు అనవసరంగా మాట్లాడడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇంత మంది చనిపోతున్నా తెలంగాణ మంత్రుల్లో చలనం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే లక్ష్యంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలోని ఆత్మహత్యలకు పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు బాధ్యత వహించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications