ఈరోజూ అసెంబ్లీ వాయిదా, సిఎంకు టి-ఎమ్మెల్యేల బాసట

కాగా తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి ఎలాంటి తప్పుడు నివేదికలు ఇవ్వలేదని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెప్పారు. తాము ఉద్యమానికి దూరంగా లేమని చెప్పారు. తెలంగాణ రాని పక్షంలో తాము దేనికైనా సిద్ధమని ప్రకటించారు. ఈ అంశంపై అధిష్టానం చెప్పిన మాటల వల్లే తాము మౌనంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణలో తెలంగాణవాదం లేదని ఎవరైనా చెప్పడం అది తప్పే అవుతుందన్నారు. తెలంగాణకు పరిష్కారం అసెంబ్లీలో లేదని మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారన్నారు. ఈ అంశం అధిష్టానం చేతిలో ఉందని మాత్రమే సిఎం చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications