వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: సోనియా విన్నారు, సుష్మా ఇస్తామన్నారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi - Sushma Swaraj
న్యూఢిల్లీ: తెలంగాణ ఇవ్వాలని తాము చెప్పిన మాటలను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాగ్రత్తగా విన్నారని, తాము చెప్పిన సమాచారాన్ని నోట్ చేసుకున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమంెటు సభ్యులు చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు గురువారం సోనియా గాంధీని కలిశారు. తెలంగాణవాదం బలంగా ఉందని వారు చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే దిశగా సోనియా వెళ్తున్నారని వారు చెప్పారు. తెలంగాణపై త్వరలోనే తమ పార్టీ అధిష్టానం స్పష్టత ఇస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని, త్వరగా తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపాలని తాము సోనియాను కోరినట్లు వారు తెలిపారు. తెలంగాణపై రేపు శుక్రవారం కూడా లోకసభను స్తంభింపజేస్తామని వారు చెప్పారు. పొన్నం ప్రభాకర్, జి. వివేక్, మధు యాష్కీ, మందా జగన్నాథం, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు సోనియాను కలిసివారిలో ఉన్నారు.

కాగా, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని లోకసభలో బిజెపి పక్ష నేత సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల కల తప్పకుండా నెరవేరుతుందని ఆమె అన్నారు. తెలంగాణలోని ఆత్మహత్యలు తనను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని ఆమె అన్నారు. తెలంగాణ కోసం తమ పార్టీ పోరాడుతుందని ఆమె చెప్పారు. తెలంగాణకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తాము ఢిల్లీలో వినిపిస్తామని ఆమె చెప్పారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె తెలంగాణ యువతకు పిలుపునిచ్చారు. తనను కలిసిన తెలంగాణవాదులతో ఆమె మాట్లాడారు.

English summary
Congress Telangana MPs met party president Sonia gandhi to seek early decission on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X