వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌నుండి అలహాబాద్ టెక్కీకి 1.34 కోట్ల ఆఫర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Uttar Pradesh
లక్నో: సోషల్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి పెద్ద మొత్తంలో వేతనం ఆఫర్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బిటెక్ విద్యార్థికి ఫేస్‌బుక్ సంవత్సరానికి రూ.1.34 కోట్లు ఆఫర్ చేసింది. ఇంతకుముందు ఇంత పెద్ద మొత్తంలో మన దేశంలోని ఏ విద్యార్థికి ఏ సంస్థ ఆఫర్ చేసింది లేదు. ఆ విశ్వవిద్యాలయ డైరెక్టర్ పి.చక్రవర్తి చెప్పిన వివరాల ప్రకారం... విశ్వవిద్యాలయానికి చెందిన బిటెక్ విద్యార్థికి ఈ అవకాశం దక్కిందన్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ విద్యార్థి పేరు, అతని వివరాలు వెల్లడించలేమని చెప్పారు.

ఈ నెల మార్చి 27వ తేదిన ఫేస్‌బుక్ నుండి కన్ఫర్మేషన్ లెటర్ అందినట్లు చెప్పారు. ఆ విద్యార్థికి సంవత్సరానికి 2,62,500 (రూ.1.34 కోట్లు) డాలర్లను ఆఫర్ చేసిందని చెప్పారు. ఆ విద్యార్థి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫేస్‌బుక్ మెయిల్ ద్వారానే ప్రారంభమైందని చక్రవర్తి చెప్పారు. గత సంవత్సరం అక్టోబర్‌లో ఇది ప్రారంభమైందని, ఆ తర్వాత టెలిఫోన్ ద్వారా తొమ్మిదిసార్లు ఇంటర్వ్యూ జరిగిందన్నారు. ఆ తర్వాతే అతనిని సెలక్ట్ చేశారని చెప్పారు. ఇప్పటికే తమ సంస్థ నుండి చాలామంది విద్యార్థులు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారని చెప్పారు.

English summary
Social networking giant Facebook has hired an engineering student here for a fat annual pay package of Rs 1.34 crore, one of the biggest offers made to alumnus of any technical institution of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X