రాజీనామా చేయండి: జగన్ పార్టీ నేత వాసిరెడ్డి సవాల్

మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యవహారాలపై విచారణ చేస్తే ఆయన జీవితాంతం జైల్లోనే ఉంటారన్నారు. వైయస్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై ప్రభుత్వం ఏం జవాబు చెబుతుందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ తరఫున స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ ఛార్జీషీటులో వైయస్ పేరు 30 సార్లు ప్రస్తావించినా మంత్రులు ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు.
సుప్రీం కోర్టుకు జవాబు చెప్పవలసిన బాధ్యత మంత్రులపైన ఉన్నా వారు తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని అన్నారు. మంత్రులు రెండు నాల్కల ధోరణితో మాట్లాడటం మానుకోవాలని సలహా ఇచ్చారు. మానసిక వ్యాధిగ్రస్తుడు రాసిన రాతలు పట్టుకొని మాట్లాడటం మంచిది కాదన్నారు. జగన్ వెంట ఉండే నేతలను విమర్శించే మీరు రోశయ్య కోళ్లా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోళ్లా, సోనియా గాంధీ కోళ్లా చెప్పాలన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు, రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకే జగన్ అరెస్టు ప్రచారం జరుగుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మరో నేత జూపూడి ప్రభాకర రావు వేరుగా అన్నారు. అక్రమంగా జగన్‌ను అరెస్టు చేస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సిబిఐని అడ్డం పెట్టుకొని టిడిపి, కాంగ్రెసు కలిసి జగన్ పేరును ఛార్జీషీటులో పెట్టాయన్నారు. జగన్ ఇమేజ్ తట్టుకోలేకే ఇలా చేస్తున్నాయన్నారు. ఎలాంటి విచారణ చేపట్టకుండా జగన్ పేరును నిందితుడిగా పేర్కొనడం సరికాదన్నారు.