గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు కనిపించట్లేదా: సిబిఐ ఛార్జీషీట్‌పై జగన్ సూటి ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నడిబొడ్డున వేల ఎకరాల భూమిని కారుచౌకగా అమ్మితే తప్పులేనిది, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఎక్కడో వెనుకబడిన జిల్లాల్లో రెండు కంపెనీలకు 75 ఎకరాల చొప్పున భూములు కేటాయిస్తే ఎలా తప్పయిందో సిబిఐ సమాధానం చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర సందర్భంగా ప్రశ్నించారు. సిమెంట్ పరిశ్రమ కోసం తాను రూ.3.50 లక్షలు పెట్టి కొనుగోలు చేసినప్పుడు ప్రిజమ్ సిమెంట్స్‌కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎకరా భూమిని కేవలం రూ.లక్ష రూపాయలకే కట్టబెట్టడం అవినీతిగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎలాగూ రాలేరని, సమాధానం ఇవ్వలేరని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

సిబిఐ తన మీద ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు చూశానని అన్నారు. పరిశ్రమల కోసం రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ వెళ్లి అడిగితే భూమి ఉచితంగా ఇస్తారని అన్నారు. తమిళనాడు తదితర రాష్ట్రాలు భూములు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కట్టబెట్టిన భూముల సంగతేమిటన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో రైతులు, పేదల కోసం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి అనర్హత వేటు వేయించుకున్న సుచరితకు పట్టం కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ చచ్చి పోయిందన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy questioned CBI about TDP chief Nara Chandrababu Naidu land allocations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X