చిరు రాజీనామా ఆమోదించలేదెందుకు: గుర్నాథ్ రెడ్డి

తమకు ఎన్నికల సంఘంపై విశ్వాసం ఉందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలలోగా పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలు ఖాళీ ఉండటం బాధాకరమన్నారు. ఉప ఎన్నికల వాయిదా కోసం కాంగ్రెసు కుట్ర చేస్తోందని మరో నేత, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వేరుగా అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెసు ప్రయత్నిస్తోందన్నారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఒక్కసీటు రాదన్నారు. బలహీన నాయకత్వం వల్లే రాష్ట్రంలో ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కాంగ్రెసుకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలను వెంటనే జరిపించాలని సవాల్ విసిరారు. రాష్ట్ర పరిణామాలను చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. ఎనిమిది కోట్ల తెలుగువారు సిగ్గుపడేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన ఉందన్నారు.
ఎన్నికల నిర్వహణపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు, టిడిపి నీచరాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. స్థానికం సంస్థల ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. బాబు, కిరణ్ కుమ్మక్కై కమీషన్లు పంచుకున్నారని ఆరోపించారు. ఎసిబి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బదలీ విచారకరమన్నారు.