వైయస్ టైమ్‌లోనూ అదే: పొంగులేటి, బాబుకు కౌంటర్

దర్యాఫ్తు సంస్థలపై బురదజల్లే కార్యక్రమాన్ని ఆయన మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోందని జగన్ విమర్శిస్తున్నారని, కానీ ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమయంలోనూ అదే జరిగిందన్నారు.
ఆయనకు అప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.తమ పార్టీ జాతీయ పార్టీ అని, అందువల్లే రాష్ట్రంలోని పరిస్థితులను ఢిల్లీలో సమీక్షలు నిర్వహించడం సహజమేనన్నారు. ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారని ఎన్డీయే హయాంలో ఇక్కడి నుంచి రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించింది బాబే అన్నారు.












Click it and Unblock the Notifications