వైయస్ పైనుండి చూసి గర్వపడేలా చెప్తున్నా!: జగన్

రాబోయేది సువర్ణయుగమని, అందులో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆకాశం నుండి చూసి గర్వపడేలా చెబుతున్నానని అన్నారు. పింఛన్లను పెంచుతానని, పేదరికం పోవడానికి ప్రతి ఇంటి నుండి ఇంజనీర్, డాక్టర్ లేదా కలెక్టర్ చేయాలన్న వైయస్ ఆకాంక్షను నేను నెరవేరుస్తానని చెప్పారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వైయస్ పథకాలను నీరుగారుస్తోందన్నారు. గ్రామాలకు వెళుతుంటే రైతుల మోములో చిరునవ్వు కనిపించడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి, ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రాన్ని రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్న పెద్దలకు ఇక్కడి పేదలు, రైతులు పడుతున్న కష్టాలు అర్థమయ్యేలా చెప్పాలంటే ఉప ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.
చచ్చిపోయిన రాజకీయ వ్యవస్థను బతికించుకొని విలువలతో కూడిన రాజకీయాలను తీసుకు వద్దామన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ నిధులను ప్రభుత్వం చెల్లించక పోవడంతో విద్యార్థులు డబ్బులు కడితే గానీ హాల్ టిక్కెట్లు ఇవ్వబోమని మేనేజ్‌మెంట్‌లు ఒత్తిడి తీసుకు వస్తున్నాయన్నారు. ఇప్పటికిప్పుడు రూ.40 నుండి రూ.50వేల ఫీజులు కట్టమంటే నిరుపేదలు ఎక్కడి నుండి తీసుకు వస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications