వైయస్సార్ కాంగ్రెస్ అంటే చెప్పలేని జగన్: రఘువీరా

raghuveera reddy
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు అంటే ఏమిటో అర్థం చెప్పలేని స్థితిలో ఆ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రి రఘువీరా రెడ్డి ఆదివారం విమర్శించారు. అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన జగన్ పైన విరుచుకు పడ్డారు. కాంగ్రెసు పార్టీ వాళ్లమందరం ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడుతుంటే జగన్ వాన్ పిక్ రాజ్యం తెస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు.

నీతి, నిజాయితీ అనే జగన్ తనపై వచ్చిన ఆరోపణలపై స్టే కోసం కోర్టుకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెసు పార్టీ ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని చెప్పారు.

వైయస్సార్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అని జగన్ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించుకున్నారని రఘువీరా రెడ్డి చెప్పారు. వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీదే విజయమన్నారు. అనంతపురం, రాయదుర్గంలో పార్టీ గెలుపొందటం ఖాయమన్నారు. గిరిజనులను మన్యం నుంచి వెళ్లగొట్టే రాజ్యాన్ని జగన్ తెస్తానంటున్నాడని మరో మంత్రి శైలజానాథ్ విమర్శించారు.

లక్ష చదరపు అడుగుల ఇల్లు కట్టుకున్న వైయస్ జగన్ విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెసు పైన విమర్శలు చేయడం అనైతికమన్నారు. రాష్ట్రంలో భారీగా డబ్బు మూటలు ఉన్న వ్యక్తి జగన్ అన్నారు. నిజాయితీ, విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమపై ఉన్న కేసులపై విచారణకు సహకరించకుండా కోర్టులకు ఎందుకు వెళ్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+