ఇందిరాగాంధీకి ఆర్ఎస్ఎస్ కితాబు, బిజెపికి మొట్టికాయ

ఒడిసాలో ఇటాలియన్ల చెరకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారశైలిపై ఆ పత్రిక ధ్వజమెత్తింది. బందీల మార్పిడికి సంబంధించి రెండు ప్రభుత్వాలకూ సరైన విధానాల రూపకల్పన లేదని విమర్శించింది. 1984లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కాశ్మీరీ టెర్రరిస్టులు భారతీయ దౌత్యవేత్త రవీంద్ర మాత్రేను బందీగా పట్టుకుని మక్బూల్ భట్‌ను విడిచిపెట్టాలని డిమాండ్ చేశాయని పేర్కొంది.
అప్పుడు ఇందిర ఆ బెదిరింపులను లెక్కచేయక మక్బూల్ భట్‌ను ఉరి తీయించారని తెలిపింది. రవీంద్రను ఉగ్రవాదులు చంపేశారని, అప్పట్నుంచీ ఏ ప్రభుత్వమైనా దృఢంగా నిలబడిన సందర్భం ఒక్కటి కూడా లేదని తెలిపింది. 1999లో విమాన ప్రయాణికులను కాపాడటానికి భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ కాశ్మీరీ ఉగ్రవాదులను తీసుకెళ్లి కాందహార్‌లో టెర్రరిస్టులకు ఒప్పజెప్పారని బిజెపి పైనా ధ్వజమెత్తింది.
1989లో అప్పటి హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యాను కిడ్నాప్ చేసినప్పుడు కూడా అప్పటి సర్కారు లొంగిపోయిందని గుర్తు చేసింది. ఇటాలియన్లను కిడ్నాప్ చేయడం ద్వారా ఒడిసాలో మావోయిస్టులు పోలీసుల చెరలో ఉన్న తమ శ్రేణులను విడిపించుకోవడమే కాకుండా, ఈ అవకాశాన్ని మళ్లీ కోలుకుని బలం పుంజుకోవడానికి వినియోగించుకుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications