వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఆత్మహత్యలు: రాహుల్ గాంధీ పైనా పిటిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: తెలంగాణ ఆత్మహత్యలకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కారణమంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన లాయర్ అరుణ్ న్యూఢిల్లీలోని పాటియాలా కోర్టులో తాజాగా సోమవారం పిటిషన్ వేశారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉంటూ ఆయన తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపిస్తూ సదరు లాయర్ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.

కాగా తెలంగాణ ఆత్మహత్యలకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీయే కారణమని తెలంగాణ ప్రాంతానికి చెందిన లాయర్ అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ పైన పాటియాల కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సుమారు 40 నిమిషాల పాటు పాటియాల హౌస్ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ మేరకు మృతుల కుటుంబాల నుంచి కోర్టు వాంగ్మూలాన్ని తీసుకొని నమోదు చేసింది.

సోనియాకు నోటీసులిచ్చి కేసు నమోదు చేయాలని పిటిషనర్ అరుణ్ కోర్టును కోరారు. అందుకు యుపిఏ చైర్మ పర్సన్ అయినంత మాత్రాన సోనియాకు నోటీసులు ఇవ్వాలా అని జడ్జి అరుణ్‌ను ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు తమ వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే మోసం ఎలా అవుతుందని, తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయలేదని, ఆ అంశం ఆమె చేతుల్లో లేదు కదా అని కోర్టు అరుణ్‌కు తెలిపింది.

తెలంగాణపై నిర్ణయం తీసుకోక పోవడం వల్ల అన్ని ప్రాంతాల వారు ఇబ్బందులు పడుతున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే తెలంగాణ అంశం ఆమె చేతుల్లో లేదు కదా అని కోర్టు ప్రశ్నించింది. కాగా సోనియా వైఖరి కారణం వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని లాయర్ అరుణ్ కుమార్ ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

English summary
Telangana lawyer Arun Kumar went to Patiala Court on AICC leader Rahul Gandhi for Telangana suicides. Court took his petition to enquiry. Already Arun Kumar have filed a case in the Patiala Court in New Delhi, charging Sonia Gandhi of being responsible for the death of 700 students and youngsters, who laid down their lives for achieving Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X