వైయస్‌ను తిట్టకుండా జగన్‌ను తిడితే ఉట్టిదే: పాల్వాయి

వైయస్ రాజశేఖర రెడ్డి మొదటి అవినీతి పరుడు కాగా ఆ తర్వాతనే వైయస్ జగన్ అని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం ఉంచిన విశ్వాసాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి వమ్ము చేశారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి తప్పులను కాంగ్రెసు నాయకులు ఎత్తి చూపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ ప్రభుత్వ హయాంలో అవినీతి బాగోతాలన్నీ ఆయనకు తెలిసే జరిగాయని పాల్వాయి అన్నారు.
తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణపై, రాష్ట్ర పరిస్థితులపై తాను సోనియా గాంధీతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. సోనియా గాంధీ ఐక్యతకు ప్రతీక అని ఆయన అన్నారు. కాంగ్రెసును బలోపేతం చేసే విషయంపై, వైయస్ జగన్‌ను ఎదుర్కునే విషయంపై సోనియాతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని తాను సోనియాను కోరినట్లు రాజ్యసభకు ఎన్నికైన మరో నాయకుడు ఆనంద భాస్కర్ చెప్పారు. రాహుల్ గాంధీతో రాష్ట్ర పరిస్థితుల గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ చెప్పారు. 2009 మాలల సింహగర్జనలో కూడా తాను ఆ విషయం చెప్పానని ఆయన బుధవారం రాజమండ్రిలో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన అన్యాయంపై ఎవరితోనైనా తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయంపై ఉప ఎన్నికల్లో తాను దళితులను చైతన్యపరుస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్న క్రమంలోనే కొంత మంది నాయకులు వైయస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం జరుగుతూనే ఉన్నది.












Click it and Unblock the Notifications