ఎసి గదుల్లో కూర్చోవడం కాదు: డిఎల్ రవీంద్రా రెడ్డి

తాను ఆరుసార్లు గెలిచినా, రెండుసార్లు ఓడిపోయినా ప్రజలను విస్మరించలేదన్నారు. కార్యాలయంలో కూర్చుంటే ప్రయోజనం ఉండబోదన్నారు. తాను కడప జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలకు దూరంగా ఉంటానని ఇప్పటికే అధిష్ఠానానికి లేఖ ద్వారా వివరించానన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి మాట్లాడాల్సిన సిఎల్పీ వేదికపై కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన నాయకుడు కూడా మాట్లాడితే ఎలా అని ఒక మంత్రి తనను ఉద్దేశించి ప్రశ్నించారని అన్నారు.
కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని దళిత వ్యతిరేకిగా వ్యాఖ్యానించిన మంత్రి కోండ్రు మురళీ మోహన్‌కు ఆయా వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. దళిత వర్గానికి చెందిన మంత్రులతోపాటు పార్టీకి చెందిన పలువురు నేతలు బుధవారం ఆయన నివాసం, సచివాలయంలోని ఆయన కార్యాలయానికి వచ్చి అభినందించారట.
వైయస్ హయాంలో అన్యాయం జరిగినందునే పలుమార్లు దళిత, గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశమై నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని తీర్మానాలు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. వైయస్‌తోపాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇదే పంథాతో ముందుకు సాగాలని వారు చెప్పారట.












Click it and Unblock the Notifications