తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తా: జెపి మాట

వరంగల్లు జిల్లా పరకాల శాసనసభా స్థానంలో పోటీ చేయాలా, వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన తెలంగాణ విద్యార్థులకు సూచించారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని ఆయన అన్నారు. తెలంగాణలో అమయాకమైన విద్యార్థులు బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామరస్యపూర్వకంగా తెలంగాణ ఏర్పడితే స్వాగతిస్తామని ఆయన చెప్పారు.
తాము ఒంగోలు, తిరుపతి, అనంతపురం, రాయదుర్గం శాసనసభా స్థానాల్లో పోటీ చేస్తామని, మరో ఏడు స్థానాల విషయంలో స్థానిక పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఒంగోలు అభ్యర్థిగా రమేశ్ రెడ్డిని, అనంతపురం అభ్యర్థిగా వెంకటరమణ (బాబు)ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణపై గతంలో జయప్రకాష్ నారాయణ కాస్తా కఠినంగా మాట్లాడుతూ వచ్చారు. ఇటీవలి కాలంలో ఆయన కాస్తా మారినట్లు కనిపిస్తున్నారు. తెలంగాణ ఏర్పడడం వల్ల ప్రజలకు ఒరిగే మేలు ఏదీ ఉండదని, ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తారని, పదవులు మాత్రమే వస్తాయని ఆయన గతంలో అంటూ ఉండేవారు.












Click it and Unblock the Notifications