తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను హత్య చేసి, కూతురిని..: ఓ తండ్రి ఘాతుకం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur Map
గుంటూరు/చిత్తూరు: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి చేసిన ఘాతుకం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని చెరుకుపల్లి గ్రామంలో ఓ భర్త తన భార్యను హత్య చేసి బాపట్ల మురికి కాలువలో పడేశాడు. వారికి రెండు నెలల పాప ఉంది. భార్యను హత్య చేసిన ఆ కసాయి తన రెండు నెలల పాపను ఇంట్లోనే ఉంచి తాళం వేశాడు. దీంతో ఆకలికి తట్టుకోలేని ఆ పసిపాప మృతి చెందింది. కూతురు జన్మించినందుకే భర్త ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలోని తిరుమలలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న ఏడుగురు దొంగలను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. తిరుమల పాప వినాశనం సీపంలో వీరు ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలైవన ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. వారి నుండి మూడు టన్నుల చందనం దుంగల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను కందూకురు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరి నుండి రూ.9 లక్షల విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రఘురామి రెడ్డి డిఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. 2010 జనవరి అర్దరాత్రి పట్టణంలోని మస్తాన్ జ్యూవెల్లర్సులో రూ.76 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు చోరీ జరిగిందన్నారు. గతంలో రూ.లక్షా పాతిక వేలు రికవరీ చేసినట్లు తెలిపారు.

కాగా గుంటూరులోని డొంక రోడ్డులో నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనం కూలి ఆరుగురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. డొంకరోడ్డులోని నారాయణ పాఠశాల అపార్టుమెంటులో ఈ ఘటన జరిగింది. నారాయణ పాఠశాల నిర్మాణంలో భాగంగా కూలీలు భూగర్భంలో పనులు చేస్తుండగా అపార్టుమెంటు గోడ మట్టి పెళ్లలు విరిగి పడ్డాయి.

English summary
Husband killed her wife and thrown his two months baby in to Sewage drains in Guntur district. Five daily wages coolies dead at Arandalpet of Guntur on monday. Apartment wall fell down while ten coolies working for school building. Police found four dead bodies. They are searching for other coolies, who were under soil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X