పాఠశాల భవనం కూలి ఆరుగురు కూలీల దుర్మరణం

ఇవి భూగర్భంలో పని చేస్తున్న కూలీల పైన పడటంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో పదిమంది కూలీలు ఈ శిథిలాల్లో చిక్కుకున్ననట్లుగా భావిస్తున్నారు. నగర శివారులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఇరవై మంది కూలీలు ఉదయం భవన నిర్మాణ పనుల కోసం వచ్చారు. పది మంది భోజనం చేసిన తర్వాత పనులు చేద్దామని పక్కనే ఉండిపోయారు.
మిగతా వారు పనులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ భవన నిర్మాణంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూలీలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అధికారులు మట్టిని తొలగిస్తున్నారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూలీలతో పాటు ఎన్టీఆర్ నగర్ వాసులు ఉన్నట్లుగా సమాచారం.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి సహాయ చర్యలను చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చింది. గుంటూరు సంఘటన సమాచారం అందడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.












Click it and Unblock the Notifications