శ్రీదేవి ముఠా అరెస్టు: తారా చౌదరి తరహాలోనే ....

Guntur Map
గుంటూరు : వ్యభిచారం రాకెట్ కేసులో అరెస్టయిన తారా చౌదరి తరహాలోనే, మరో ముఠా కార్యకలాపాలను గుంటూరు పోలీసులు రట్టు చేశారు. విటులకు అమ్మాయిలను కుదిర్చి పెట్టి, వారి రాసలీలలను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసిన తారా చౌదరి తరహాలోనే ఈ ముఠా పనిచేస్తోంది. ఈ ముఠా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు నెట్‌వర్క్ పెట్టుకుని పలువుర్ని బ్లాక్‌మెయిల్ చేస్తోందని పోలీసులు చెప్పారు.

వివరాల్లోకి వెళ్తే.... గుంటూరు జిల్లా గురజాల మాజీ శాసనసభ్యుడు కాయితి వెంకట నర్సిరెడ్డికి గతనెల 20 నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపుఫోన్లు వచ్చాయి. 10 లక్షలు ఇవ్వకుంటే మీకు సంబంధించి అశ్లీల దృశ్యాలను మీడియాకు విడుదల చేస్తామని, నెట్ లో ఉంచుతామని బెదిరించారు. దీంతో ఆయన గత నెల 26న గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో హైదరాబాద్ కేంద్రంగా ఈ ముఠా వ్యవహారం వెలుగు చూసింది.

గతంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ పత్రిక ప్రకటనల విభాగంలో పని చేసిన మెటపోతుల కేశవరావు, తనకు పరిచయం ఉన్న విజయవాడకు చెందిన న్యాయవాది చింతల రాంప్రసాద్, చెన్నైకి చెందిన శ్రీదేవితో ముఠా ఏర్పాటు చేశాడు. ప్రముఖులను గుర్తించి వారి సెల్‌కు శ్రీదేవితో ఫోన్‌లో మాట్లాడించి ట్రాప్ చేస్తారు. తరువాత వారిని పిలిపించుకుని శృంగార కార్యకలాపాల్లో ఉన్నప్పుడు రహస్యంగా చిత్రీకరించి, బ్లాక్‌మెయిల్ చేస్తారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు చెందిన వైద్యుడ్ని బెదిరించి 13 లక్షల వరకు వసూలు చేశారు. తరువాత ఢిల్లీలో కేంద్ర మంత్రిత్వశాఖలో పనిచేసే పీఏ ఓజా, పార్లమెంట్‌లో పనిచేసే మణిపాల్ యాద వ్, తబలా అనే వారితోపాటు గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకట నర్సిరెడ్డి తదితరులను ఇదే తరహాలో బ్లాక్‌మెయిల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో గుం టూరు పోలీసులు ముఠా సభ్యులు కేశవరావు, చింతల రాంప్రసాద్‌ను కొద్దిరోజుల కిం ద అరెస్ట్ చేశారు. మంగళవారం శ్రీదేవిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+