పోలీసుల చేతికి స్టూవర్టుపురం దొంగ, 13 ఏళ్లుగా వేట

చిల్లర దొంగగా ఈయన తన ప్రస్థానం ఆరంభించాడు. కానీ ఆ తర్వాత క్రమంగా కోట్లకు పడగలెత్తాడు. అతనికి స్టువర్టుపురంలో కోట్ల ఖరీదు చేసే నాలు గంతస్తుల భవనం ఉందట. మహరాజ్ ఏర్పాటు చేసిన ముఠా ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలను కొల్లగొట్టింది.
తరచూ వేషధారణ మారుస్తూ రైలు ఎసి బోగీల్లో లేదంటే విమానాల్లోనే తిరుగుతుండటం మహరాజ్ స్టైలంట. చివరకు పది రోజుల క్రితం తిరుపతి క్రైం బ్రాంచి పోలీసులకు అనూహ్యంగా చిక్కాడు. మహరాజ్‌కు బంధువయ్యే ఉత్తం అలియాస్ పాలడబ్బా ద్వారా తిరుపతి పోలీసులు వల పన్ని పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు మహరాజ్ నుంచి సుమారు 7, 8 కిలోల బంగారం రికవరీ చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా స్టువర్టుపురం, చీరాల ప్రాంతాల్లో పోలీసులు ఇదే పనిలో ఉన్నారట. పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే 50 కిలోలకు పైగా బంగారంతో పాటు పెద్ద మొత్తంలో ఆస్తులు రికవరీ అవుతాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications