వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెల్లెని రేప్ చేశాడని మిత్రుడి హత్య, లొంగుబాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Map
ముంబై: తన చెల్లెని రేప్ చేశాడనే కోపంతో 38 ఏళ్ల వ్యక్తి తన మిత్రుడిని హత్య చేశాడు. ఆ తర్వాత బుధవారం తెల్లవారు జామున పోలీసులకు లొంగిపోయాడు. తన చెల్లె ఏప్రిల్ 9వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకుందని, దాంతచో తాను తన మిత్రుడిని చంపానని ఘట్కోపార్ నివాసి కన్నన్ పిళ్లై చెప్పాడు. అతని వాంగ్మూలాన్ని రికార్డు చేసిన తర్వాత పోలీసులు గోవింద్ అనే వ్యక్తి హత్యకు గురైన చోటికి వెళ్లారు. గోవిందన్ గొంతు కోసి అతను హత్య చేశాడు.

ఘట్కోపారా తూర్పులోని హరి ఓం చావ్ల్‌లో తన కుటుంబ సభ్యులతో పాటు గోవిందన్ తన అనుమతితో ఉంటూ వస్తున్నాడని, గత ఐదేళ్లుగా తమతో పాటే ఉంటున్నాడని నిందితుడు చెప్పాడు. ఏప్రిల్ 10వ తేదీన తన చెల్లె అత్యాచారానికి గురైందనే విషయం తన తల్లి అతి కష్టం మీద తెలుసుకుందని అతను చెప్పాడు. తన చెల్లెను గోవిందన్ ఒక నెలలో నాలుగు సార్లు రేప్ చేశాడని పిళ్లై చెప్పాడు.

తన చెల్లె అత్యాచారానికి గురైందని తల్లి ద్వారా తెలుసుకున్న పిళ్లై గోవిందన్‌ను చంపడానికి నిర్ణయించుకున్నాడు. చంపడానికి ముందు పిళ్లై గోవిందన్‌ను రాత్రి మొత్తం పార్టీకి తీసుకుని వెళ్లడానికి ప్రణాళిక వేసుకున్నాడు. ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి వారిద్దరు బయలుదేరారు. బయలుదేరే ముందు పిళ్లై తన వెంట ఓ కత్తి తీసుకుని వెళ్లాడు.

పిళ్లై పూజా బార్‌లో మద్యం కొన్నాడు. తమ ప్రాంతానికి సమీపంలో ఉన్న కామరాజ్ నగర్‌లో ఆటోలో నిలిపి ఉన్న స్థలంలో ఇద్దరూ కూర్చున్నారు. బుధవారం తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో తన మిత్రుడు పూర్తిగా మత్తులో ఉన్నాడని గ్రహించిన పిళ్లై - తన చెల్లెను ఎందుకు రేప్ చేశావని అడిగాడు. తాను ఆమెను ప్రేమిస్తున్నానని గోవిందన్ చెప్పాడు. దాంతో ఆగ్రహించిన పిళ్లై అతని గొంతు కోసి హత్య చేశాడు.

English summary
A 38-year-old man surrendered before the Pant Nagar police in the wee hours on Wednesday after he allegedly stabbed his friend for raping his sister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X