తెలంగాణ కోసం ఢిల్లీకి: జానా రెడ్డిపై గెలిచిన కిరణ్ రెడ్డి!

ఇప్పటికిప్పుడు ఢిల్లీ వెళ్లాల్సిన ఆవశ్యకత లేదని చెప్పారు. తగిన సమయం చూసుకొని ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ అంశంపై కేంద్రం తక్షణమే స్పందించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం తాము ఎన్ని విమర్శలైనా ఎదుర్కొంటామని చెప్పారు. తెలంగాణ కోసమే తాము సంయమనం పాటిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ ఆకాంక్షను ఎవరూ ఆపలేరన్నారు. హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగం కాదని ఎవరైనా చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ఖచ్చితంగా అది తెలంగాణలో భాగమే అన్నారు. తెలంగాణ కోసం ప్రస్తుతం ఢిల్లీ వెళ్లినా వెళ్లకున్నా ఉత్తరాల ద్వారా తమ ఆకాంక్షను అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పారు. తెలంగాణ ఆవశ్యకత తెలియజేస్తూ జానా రెడ్డి అధిష్టానికి లేఖ కూడా రాశారు.
కాగా ఇటీవల తెలంగాణ కోసం అధిష్టానాన్ని ఒప్పించేందుకు ఢిల్లీ వెళ్లాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరందరినీ ఢిల్లీ తీసుకు వెళ్లే భాగంలో జానా రెడ్డి సమన్వయ పరుస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు జానాతో భేటీకి వెళ్లకుండా మోకాలడ్డారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు జానా కూడా ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం.
మరోవైపు ఢిల్లీ వెళ్లేందుకు తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ ఆపితే ఆగిపోయేంత బలహీనులు కాదని ఉదయం పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు అన్నారు. ఆయన జానా రెడ్డితో మధ్యాహ్నం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లేందుకు మంత్రులు సిద్ధమవుతున్నారని, ఎప్పుడు వెళ్లేది త్వరలో తేదీ ప్రకటిస్తామని చెప్పారు. అధిష్టానంపై తెలంగాణ కోసం ఒత్తిడి తెస్తామని చెప్పారు. జానా రెడ్డి మాత్రం సాయంత్రం ఢిల్లీ వెళ్లాల్సనన అవసరం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications