బిజెపి, ఎంఐఎంపై జగ్గారెడ్డి నిప్పులు, జగన్‌కు చురక

బిజెపి, ఎంఐఎం వల్లే మత ఘర్షణలు చోటు చేసుకుంటాయని మండిపడ్డారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తనను విమర్శించారన్నారు. సంగారెడ్డి వచ్చి తనపై ఆరోపణలు చేయడం బయట వారికి తగదన్నారు. స్థానికులు చెబితే ఆ సంఘటనకు తానే బాధ్యత వహిస్తానని చెప్పారు.
ఓవైసి ఉద్దేశ్య పూర్వకంగా తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బిజెపి గెలుపొందాకే సంగారెడ్డి, హైదరాబాదులోని మాదన్నపేటలో మత ఘర్షణలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. తమ స్వార్థం కోసం కొందరు నేతలు పరామర్శల పేరుతో పర్యటనలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తదితరులను ఉద్దేశించి అన్నారు.
తనను నేరుగా ఎదుర్కోలేక కొందరు తనపై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే తెలుగుదేశం పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. కిరణ్ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని అది ఓర్వలేకే టిడిపి విమర్శలు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications