రాయపాటిపై పేలిన తారా చౌదరి టేప్: కాదంటున్న ఎంపి

ఆంధ్రజ్యోతి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి - "కన్నా లక్ష్మీనారాయణ నన్ను కిడ్నాప్ చేసినట్లు చెబితే... 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఇస్తామని రాయపాటి సాంబశివరావు నాతో అన్నారు. అయితే, నేనెందుకు చెబుతానండీ.. ఆయన మొహమే నాకు తెలీదు. ఆయన మినిస్టర్, మంచి వ్యక్తి. ఆయన గురించి చెడుగా ఎందుకు చెబుతానని అన్నాను'' అని తార పేర్కొంది. 'మనం మనం ఒకే కులం. కన్నా గురించి చెడుగా చెప్పు' అని మళ్లీ బెదిరించారని కూడా తెలిపింది.
ఆ పత్రిక ఇంకా ఇలా రాసింది - రాయపాటి మనుషులు తనను బెదిరించిన టేపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, మీడియాకు ఇవ్వడంలేదని కూడా వివరించింది. రాయపాటిపై ఆరోపణలకు సంబంధించిన తారా చౌదరి టేపు అనుమానాస్పదంగా ఉండటం గమనార్హం. ఇద్దరు పోలీసు అధికారులతో మాట్లాడిన టేపుల్లో సంభాషణ సహజంగా ఉండగా, రాయపాటి టేపుల్లో మాత్రం తార గొంతు మాత్రమే వినిపించింది. ఆమె ఎవరికి, ఎందుకు, ఏ సందర్భంలో ఈ మాటలు చెప్పారనే సంగతి అందులో స్పష్టం కాకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దీని వెనుక కుట్ర దాగి ఉందని రాయపాటి స్పష్టం చేశారు.
తారా చౌదరి వ్యవహారంతో పలువురు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సరస సంభాషణలు, చిత్రాలతో సెల్‌ఫోన్ మెమొరీ కార్డులు నిండిపోతుండటంతో, తార తరచూ వాటిని మార్చేదని తెలిసింది. పోలీసులు ఆమె ఇంట్లో 16 మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ మెయిలింగ్ ద్వారా వచ్చిన సొమ్ముతో తార వడ్డీ వ్యాపారం చేసినట్లు తెలిసింది. ఒక చిన్న నిర్మాత రూ.3 లక్షల అప్పు తీర్చకపోవడంతో, తనతో పరిచయం ఉన్న ఇద్దరు పోలీసు అధికారులను రంగంలోకి దించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications