ఆరుషి కేసు: నూపుర్ తల్వార్ వారంట్ పొడగింపు

నూపుర్ తల్వార్‌పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేయాలని సిబిఐ కోర్టును కోరింది. ఇది వరకు జారీ చేసిన వారంట్ గడువు ముగిసిపోవడంతో మరో వారంట్ జారీ చేయాలని కోర్టు కోరింది. బుధవారంతో గత వారంట్ గడువు ముగిసింది. సుప్రీంకోర్టు ముందు బెయిల్ దరఖాస్తు పెండింగులో ఉన్నందున అరెస్టు వారంట్ జారీ చేయకూడదని నూపుర్ తల్వార్ తరఫు న్యాయవాది కోరారు. విచారణను కోర్టు 30వ తేదీకి వాయిదా వేసింది.
పద్నాలుగేళ్ల ఆరుషి 2008 మార్చి 16వ తేదీన హత్యకు గురైంది. గొంతు కోసి ఆమెను హత్య చేశారు. ఈ సంఘటన ఢిల్లీ శివారులోని నోయిడాలో గల తల్వార్ నివాసంలో జరిగింది. ఆరుషి హత్యకు గురైన మర్నాడు ఇంటి పనిమనిషి హేమరాజ్ శవం టెర్రాస్‌పై కనిపించింది.
ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆరుషి తండ్రి రాజేష్ తల్వార్‌పై హత్యా నేరం మోపారు. అతన్ని అరెస్టు కూడా చేశారు. సిబిఐ కోర్టు కేసు దర్యాప్తు చేయడానికి ముందే రాజేష్ తల్వార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications