'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణపై చీటింగ్ కేసు, మరో ఇద్దరి పైనా

వేమూరి రాధాకృష్ణతో పాటు మరో ఇద్దరి పైన 420 చీటింగ్, నమ్మకద్రోహం 406 ఇండియన్ పీనల్ కోర్టు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశించిందని పేర్కొంది. గతంలో కొంతకాలం సేల్స్ ఆఫీసర్‌గా ఆ పత్రిక అడ్వర్జయిజ్ విభాగంలో రామచందర్ అనే ఉద్యోగి పని చేశాడు. ఉద్యోగ సమయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని పద్దులను యాజమాన్యానికి అప్పగించాడు.
ఉద్యోగంలో చేరే ముందు రామచందర్ నుంచి సెక్యూరిటీ చెక్కులను, ప్రభుత్వ ఉద్యోగి పూచీకత్తును యాజమాన్యం తీసుకుంది. అన్నీ సవ్యంగా చెల్లించి ఉద్యోగం మానేసి వెళ్లినా తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రామచందర్ ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై సైబరాబాద్ మెజిస్ట్రీట్‌లోపిటిషన్ దాఖలు చేశాడు.
దీనిపై విచారించిన పదకొండవ మెట్రాపాలిటన్ కోర్టు న్యాయమూర్తి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, ప్రచురణల విభాగాధిపతి రామకృష్ణ, రవిలపై నమ్మకద్రోహం, చీటింగ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications