వైయస్సార్ టార్గెట్: గవర్నర్‌కు కిశోర్ చంద్రదేవ్ లేఖ

ఆ టీవీ చానెల్ వార్తాకథనం ప్రకారం - గవర్నర్‌కు కిశోర్ చంద్రదేవ్ రాసిన 15 పేజీల లేఖ తమ వద్ద ఉందని ఆయన చానెల్ తెలిపింది. జిందాల్, రస్ ఆల్‌ఖైమాలకు అక్రమంగా బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలకు వైయస్ రాజశేఖర రెడ్డి అక్రమంగా అనుమతులు ఇచ్చారని కిశోర్ చంద్రదేవ్ తన లేఖలో ఆరోపించారు. దాంతోనే ఆ ప్రాంతంలో అలజడి చెలరేగిందని, ఇది శాంతిభద్రతల సమస్యను సృష్టించే ప్రమాదం ఉందని ఆయన గవర్నర్‌కు రాసిన లేఖలో చెప్పారు.
రాజ్యాంగబద్దంగా సంక్రమించిన విచక్షణాధికారాలను ఉపయోగించి, అనుమతులను రద్దు చేయాలని ఆయన గవర్నర్‌ను కోరారు. కిశోర్ చంద్రదేవ్ రాసిన లేఖ విషయాన్ని గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు తెలిపినట్లు సమాచారం. దానిపై తనను ఏం చేయమంటారని గవర్నర్ రాష్ట్రపతిని అడిగారు. గవర్నర్ రాష్ట్రపతిని కలిసి ఆ విషయాన్ని వివరించినట్లు ఆ చానెల్ తెలియజేసింది.
కిశోర్ చంద్రదేవ్ గవర్నర్ నరసింహన్‌కు రాసిన లేఖపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు కూడా పాల్గొన్నారు. మరణించిన తర్వాత వైయస్‌పై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని, జీవించి ఉన్నప్పుడు ఎందుకు బయటకు తేలేదని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి బాక్సైట్ నిక్షేపాల కేటాయింపు రాజ్యాంగ విరుద్దమని కిశోర్ చంద్రదేవ్ గవర్నర్‌కు రాసిన లేఖలో ఆరోపించారు.












Click it and Unblock the Notifications