అది తగదు: చిరంజీవిపై కెకె, చంద్రబాబుపై పొంగులేటి

చిరుకు ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని తాము ప్రశ్నించడం లేదని, మాకు ఎందుకు ఇవ్వరని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల బాధను, ఆవేదనను పార్టీ పెద్దలు అర్థం చేసుకోవాలని చెప్పారు. అందరం కలిసి ప్రయాణం చేస్తేనే పార్టీకి లాభం ఉంటుందని ఆయన అన్నారు. వాయలార్ రవి వచ్చింది తెలంగాణ కోసం కాదని ఉప ఎన్నికల కోసమేనని అన్నారు. ఆయన కోదండరామ్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
మరోవైపు కాంగ్రెసు పార్టీ శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాబు కాంగ్రెసును విమర్శించే ముందు టిడిపిని చక్కబెట్టుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికలలో టిడిపి పది సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. బాబు అవినీతి సామ్రాట్ అని స్వయంగా ఆయన మామ, స్వర్గీయ నందమూరి తారక రామారావే చెప్పారన్నారు.
వాయలార్ రవి సూటుకేసులు తీసుకు వెళ్లేందుకే రాష్ట్రానికి వచ్చారని బాబు చెప్పడం శోచనీయమన్నారు. సూటుకేసుల సంస్క్కతి చంద్రబాబుదే అని విమర్శించారు. కాంగ్రెసు పార్టీలో కొందరు కూర్చున్న కొమ్మనే నరికే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నేతలు విభేదాలు పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల కోసం కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలలో ఉత్తేజం నింపేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రానికి పరిశీలకులు రావడం కాంగ్రెసుకు కొత్తేమీ కాదని ఆయన చెప్పారు. వాయలార్ రవి పర్యటన వల్ల పార్టీకి లబ్ధి చేకూరుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications