ఎప్పటికప్పుడు చెబుతున్నా: వైయస్ వివేకా, జగన్‌పై...

వైయస్ రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెసు పార్టీ నేతలే విమర్శించడం శోచనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత వైయస్‌దేనని చెప్పారు. ఆయన గురించి కాంగ్రెసు నేతలు చెడుగా మాట్లాడటం సరికాదని అన్నారు. వారి విషయాన్ని ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నట్లు చెప్పారు.
జలయజ్ఞం, ఇందిరమ్మ తదితర పథకాలను ప్రవేశ పెట్టి మహానాయకునిగా వైయస్ ఎదిగారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఏనాడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. ఆయనను విమర్శించరాదని వాయలార్ రవి చెప్పినప్పటికీ కొందరు నాయకులు విమర్శించడం దారుణమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇంతటి వైభవాన్ని తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలపై ప్రశ్నించగా రాజకీయాల్లోకి అందరూ రావడం సహజమేనని చెప్పారు. కాగా ఇటీవల దివంగత వైయస్ పైన కాంగ్రెసు పార్టీకి చెందిన కొందరు నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications